విజయవాడలో తొలిసారి ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఉద్యానవన ఉత్పత్తులు, మామిడి ప్రదర్శన-2016ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

Tuesday, 24 May 2016 07:00

విజయవాడలో తొలిసారి ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఉద్యానవన ఉత్పత్తులు, మామిడి ప్రదర్శన-2016ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం, సీఐఐ, ఉద్యానవన శాఖలు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శన ఈనెల 25వరకు జరగనుంది. నగరంలోని లయోలా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శనలో రాష్ట్రవ్యాప్తంగా 200 మంది వరకూ రైతులు, అమ్మకందారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా 13మంది ఉద్యాన ఉత్తమ రైతులకు ముఖ్యమంత్రి పురస్కారాలు అందచేశారు. రాష్ట్రంలో ఉద్యాన పంటలను కోటి 25 లక్షల ఎకరాలకు విస్తరించి ఆంధ్రప్రదేశ్ ను ఉద్యాన క్లస్టర్ గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు.