భూగర్భ జలాల పెంపు కోసం కురిసే ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం

Tuesday, 19 May 2015 05:45

భూగర్భ జలాల పెంపు కోసం కురిసే ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జల సంరక్షణకు పిలుపునిచ్చింది. ఆ పిలుపునందుకున్న శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఉద్యమ రీతిలో ఇంకుడు గుంతలను నిర్మించారు. జల సంరక్షణే ధ్యేయంగా దాదాపు లక్ష ఇంకుడు గుంతల తవ్వకాలతో రికార్డు సృష్టించారు. 
శ్రీకాకుళం జిల్లాలో వెల్లివిరిసిన స్ఫూర్తి ముఖ్యమంత్రిని ఆకర్షించింది. జిల్లాలో భారీగా ఇంకుడు గుంతల నిర్మాణం జరగడంపై చంద్రబాబు ఆరా తీశారు. జల సంరక్షణపై కలెక్టర్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. జిల్లాలో లక్ష ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేశామని.. ఒక్క రోజే టెక్కలి నియోజకవర్గంలో 40 వేల ఇంకుడు గుంతలు తవ్వించామని ముఖ్యమంత్రి దృష్టికి జిల్లా కలెక్టర్‌ తీసుకెళ్లారు. అన్ని జిల్లాల్లో ఇదే రీతిలో, ఇదే స్ఫూర్తితో ఇంకుడుగుంతల నిర్మాణం అమలు చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు