శ్రీ నాగేశ్వరరావు నా తమ్ముడు - మహానటుడు అతడు నటించక పోతే దేవదాసు లేడు : ఎన్.టి.ఆర్

చిత్రాల్లో కధానాయకుడై తక్కిన పాత్రలను నడిపించినట్ట్లే అవసరం కల్గినప్పుడు నాయకుడై తక్కిన వారిని తన మార్గానికి తిప్పుకొని నడిపించగల శక్తి ఉన్న ధీమంతుడు.నేను శ్రీరామరావు గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు వున్నాయి. నట జీవితంలోనూ నిజజీవితంలోనూ ఆయనకు ఒక్క లాంటి చిత్తశుద్దే వున్నది.అతను అలవాట్లు, పద్దతులు చాల గొప్పవి.అంతా టైమ్ ప్రకారం జరిగే జీవితం అయనది. ఎప్పుడూ బీజీగా వుండే వ్యక్తి ఆయన. ఆయన చేసే ప్రతి పనిలోనూ చిత్తశుద్ది కన్పిస్త్తుంది.అదే ఆయన నటించిన చూస్తున్నప్పుడు మనకు కలిగే భావం శ్రీరామారావు నటించే విధానం పద్దతి వేరుగా వుంటాయి.అవి ఆయన సొంతం.ఏహాలీవుడ్ నటుని విధానం లోనో ఇంకెవరి నటుని పద్దతిలోనో ఆయన నటించారు అనడానికి ఎక్కడా కన్పించదు.
ఆయన ఎవర్నీఅనుసరించరు.అనుసరించలేదు. ఆయన బాణీని అనుసరించేవారే వుంటారు.ఆయన నటించిన రాజు-పేద చిత్రం చూశాను.అందులోఆయన ధరించినపాత్రక్లిష్టమైనది.ఆ పాత్రధారణలో అయన గొప్పనైపుణ్యం చూపించారు.ఆయన నటన నన్ను ముగ్ధుణ్ణి చేసింది.నిజం చెప్పాలంటే అతను ఒక్క హీరోపాత్రధారేకారు.క్యారెక్టర్ యాక్టర్.ఒక తెలుగు చిత్రంలో ఆయన ముసలి వాడి పాత్ర ధరించి కళ్ళజోడు పెట్టుకొని వస్తూ మాట్లాడుతూ వుంటే నేను ఆయనేనని నమ్మలేక పోయాను.అ పాత్రను ఆయన అద్భుతంగా పోషించారు.శ్రీరాముడు,శ్రీకృష్ణుడు మొదలైన పౌరాణిక పాత్రలను ధరించడంలో ఆయనకు ఆయనే సాటి.పురాణపాత్రకు కావల్సిన సౌందర్యం,ఆ పాత్రకు తగ్గ నటనా ఆయన దగ్గర చూడగల్గుతాము.ఏ పాత్ర ధరించినా అపాత్రకు ఆయన అమర్చినట్లు వుంటారు.




