ఇటీవలి వార్తలు

  • తిరుపతిలో జరుగుతున్న తెదేపా మహానాడులో శుక్రవారం ప్రతిపాదించిన కార్యకర్తల సంక్షేమం- శిక్షణ, తెదేపా 35 ఏళ్ల ప్రస్థానంపై తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ జెండా మోసిన ఏ కార్యకర్తకూ అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్‌ ఆదర్శ పాఠశాల, కళాశాలల ద్వారా కార్యకర్తల పిల్లలకు ఉచితంగా విద్యనందించడానికి అన్ని జిల్లాల్లోనూ ఎన్టీఆర్‌ ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది కృష్ణా, వరంగల్‌ జిల్లాల్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తల సంక్షేమ విభాగానికి లోకేష్‌ సమన్వయకర్తగా ఉన్నారని, గత 23 నెలల్లో ఈ విభాగానికి కార్యకర్తల నుంచి ఆరోగ్యం, ఆర్థిక సహాయం, విద్య, పింఛన్లకు సంబంధించి 25 వేల దరఖాస్తులు అందాయని, వాటిని పరిశీలించి దాదాపు 22 వేల దరఖాస్తులు పరిష్కరించినట్లు వివరించారు. 1563 మంది కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం, పింఛను, 665 మంది పిల్లలకు ఉచిత విద్య అందించినట్లు తెలిపారు. కార్యకర్తల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్‌మేళాలు నిర్వహించామని, దాదాపు 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. రూ.9 కోట్ల ఖర్చుతో బీమా సౌకర్యం కల్పించామన్నారు. 0 ఇంకా చదవండి 861 తిరుపతిలో జరుగుతున్న తెదేపా మహానాడులో శుక్రవారం ప్రతిపాదించిన కార్యకర్తల సంక్షేమం- శిక్షణ, తెదేపా 35 ఏళ్ల ప్రస్థానంపై తీర్మానాలు చేశారు
  • తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘మహానాడు’ సందర్భంగా తిరుపతి నగరం లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు మహానాడు ముగింపు ఉత్సవంలో పాల్గొన్నాడు. శ్రీ యనమల రామకృష్ణుడు,  శ్రీ రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు ఈ సందర్భంగా మాట్లాడారు 0 ఇంకా చదవండి 862 తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘మహానాడు’ సందర్భంగా తిరుపతి నగరం లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు మహానాడు ముగింపు ఉత్సవంలో పాల్గొన్నాడు
  • పేద కుటుంబానికి పెద్దన్నగా ఉంటానని మాటిచ్చి ఆ ప్రకారమే పేదలకు అండగా నిలిచానని మహానాడు సభలో ప్రసంగించిన చంద్రబాబు అన్నారు. ''చంద్రబాబునాయుడు..తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్ప కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌ బాగుపడదని ప్రజలు అధికారమిచ్చారు. 1996లో జీతాలు లేని పరిస్థితినుంచి మిగులు బడ్జెట్‌కు సమైక్యాంధ్రప్రదేశ్‌ను తీసుకెళ్లినట్లే.. ఇప్పుడు నవ్యాంధ్రను అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషిచేస్తున్నా. కేంద్ర సహాకారం కూడా ఇంకా పూర్తిగా అందడం లేదు. ఒకవైపు ఆర్థికలోటు, మరోవైపు అప్పు తెద్దామంటే కుదరనివ్వని ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం...ఇలాంటి పరిస్థితులలో రుణమాఫీ, పింఛను మొత్తం పెంపు వంటి హామీల అమలుకు డబ్బులేదని చెప్పుండొచ్చు. కానీ ప్రజలు నమ్మకముంచారు. నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎన్ని ఇబ్బందులున్నా దేశంలోనే ఎవరూ చేయనట్లుగా రూ.1.50లక్షల వరకు ప్రతి రైతుకు రుణ ఉపశమనం కలిగించాం. డబ్బులేకుంటే నాలుగువాయిదాల్లో 10శాతం వడ్డీతో చెల్లించేలా ఏర్పాటుచేశాం. హామీ ఇవ్వకున్నా పండ్లతోటల రైతాంగానికీ మాఫీ చేశాం. పింఛన్లను వెయ్యి, రూ.1500లకు పెంచి మాట నిలబెట్టుకున్నా. కేజీ బియ్యం రూపాయికే ఇవ్వడంతో పాటు...కోటాను పెంచాం. ప్రతి పేదోడికి వంటగ్యాస్‌ ఇస్తాం. చెప్పినవాటికంటే ఎక్కువగానే పనులు చేశాం. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.'' అని చంద్రబాబు చెప్పారు. 0 ఇంకా చదవండి 860 పేద కుటుంబానికి పెద్దన్నగా ఉంటానని మాటిచ్చి ఆ ప్రకారమే పేదలకు అండగా నిలిచానని మహానాడు సభలో ప్రసంగించిన చంద్రబాబు అన్నారు.
  • తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘మహానాడు’ సందర్భంగా తిరుపతి నగరం పసుపుమయంగా మారింది. మహానాడు ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కార్యకర్తలు, కళాకారుల ఆటపాటలతో సందడి నెలకొంది. మహానాడు ప్రాంగణాన్ని చేరుకున్న తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తన పేరును రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఎన్టీఆర్ ఫోటో 3డీ షోను ప్రారంభించారు. ఆపై ఫొటోగ్యాలరీ, రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. అక్కడినుంచి నేరుగా ప్రధాన వేదికపైకి చేరుకుని అక్కడ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహానాడు కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలివస్తున్నారు. ప్రతినిధుల నమోదు కేంద్రాల వద్ద కార్యకర్తలు భారీగా తరలివచ్చి పేరు నమోదు చేసుకుంటున్నారు. మహానాడు తొలిరోజు కార్యక్రమాలు సాయంత్రం ఆరింటి వరకు కొనసాగుతాయి. ఈ నెల 27 నుంచి 29 వరకూ జరిగే మహానాడులో గత రెండేళ్ల కాలంలో చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుని...భవిష్యత్తుకు దిశానిర్దేశం కోసం పలు అంశాలపై చర్చించనుంది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కార్యకర్తలు ఇక్కడకు తరలివస్తున్నారు. మహానాడు వద్ద ఎన్టీఆర్ ఫోటో త్రీడీ ఎగ్జిబిషన్ మహానాడుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్ సినీ జీవిత విశేషాలు తెలిపుతూ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న మహానాడులో 28 తీర్మానాలకు ఆమోదం తెలుపనున్నారు. విభజన హామీలు, రాజధాని నిర్మాణం కీలక అంశాలపై మహానాడులో ప్రధాన చర్చించనున్నారు. మరోవైపు మహానాడు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరంలో కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేస్తున్నారు. మహానాడు విశేషాలు: తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి మొత్తం 30 వేల మంది ప్రతినిధులు మహానాడుకు రానున్నారని అంచనా ఏపీకి సంబంధించి 13అంశాలు, తెలంగాణకు సంబంధించి 8అంశాలపై తీర్మానాలు ఉండనున్నాయి. ఉమ్మడిగా ఏడు తీర్మానాలుంటాయి. 270 మంది కూర్చునేందుకు వీలుగా వేదిక తయారైంది  ఎండ వేడి తగలకుండా సభా ప్రాంగణంలో 50కి పైగా కూలర్లు ఉంచారు  ప్రతినిధులకు నిత్యం 27 రకాల వంటకాలతో భోజన ఏర్పాట్లు జరిగాయి  వీఐపీలు, ప్రెస్‌, ప్రతినిధులకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటుచేశారు 0 ఇంకా చదవండి 858 తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘మహానాడు’ సందర్భంగా తిరుపతి నగరం పసుపుమయంగా మారింది.
  •  తిరుప‌తి నుండి నేరుగా అమెరికా, దుబాయ్‌ల కి..  విదేశాల నుంచి శ్రీ‌వారిని ద‌ర్శించ‌డానికి వ‌చ్చే భ‌క్తుల‌కు శుభవార్త‌! ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత పుణ్య‌క్షేత్రం తిరుప‌తి నుంచి విమానాల ద్వారా ఇక నేరుగా అమెరికా, దుబాయ్‌ల‌కు రాక‌పోక‌లు సాగించ‌వ‌చ్చు 0 ఇంకా చదవండి 857 తిరుప‌తి నుండి నేరుగా అమెరికా, దుబాయ్‌ల కి..

Pages