ఇటీవలి వార్తలు

  • ఎలక్ట్రానిక్ రంగంలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాలు పొందే లక్ష్యంతో ఎలక్ట్రానిక్ పాలసీని రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత రెండేళ్ళలో సాధించిన ప్రగతి ఇలా ఉంది... ఫాక్స్ కాన్ - ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సిటీ వద్ద ఉన్న ఫాక్స్ కాన్ తయారీ విభాగం, ప్రస్తుతం నెలకు  10 లక్షల యూనిట్ లను తయారు చేస్తోంది. 25 అసెంబ్లింగ్ విభాగాలలో 6,000 మంది పనిచేస్తున్నారు. షియామీ - శ్రీ సిటీ కేంద్రంగా మొబైల్ ఫోన్లను తయారుచేస్తున్న ఈ చైనా సంస్థ, ఇండియాలో తయారు చేసిన తొలి స్మార్ట్ ఫోన్ ను విశాఖలో విడుదల చేసింది. 'మేక్ ఇన్ ఇండియా.. మేక్ ఇన్ ఎపి' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో తయారైన తొలి దేశీయ షియామీ మొబైల్ ఫోనును ఆగష్టు 10, 2015న మార్కెట్లోకి విడుదల చేశారు చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి సంస్థలకు మొబైల్ ఫోన్లను తయారుచేసి ఇచ్చే తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ సంస్థే ఈ మొబైల్ ను ఉత్పత్తి చేసింది. బెల్ (BEL) - అనంతపురం జిల్లా, పాలసముద్రం ప్రాంతంలో BEL సంస్థ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ ను నెలకొల్పుతోంది. ఈ ప్రాజెక్టులో రానున్న మూడేళ్ళలో రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది BEL దేశంలోనే అతి పెద్దదిగా 900 ఎకరాల్లో అవతరించనున్న ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు సమక్షంలో కేంద్ర రక్షణ మంత్రి సెప్టెంబర్ 30,2015న శంకుస్థాపన చేశారు  జియోనీ - ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మొబైల్ తయారీ సంస్థ జియోనీ, రానున్న మూడేళ్ళలో శ్రీసిటీలో రూ 330 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ మొబైల్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ తో ఒప్పందం కుడుర్చుంది. రానున్న అక్టోబర్ నుండి ఎఫ్ మరియు పి సిరీస్ ఫోన్లను తయారుచేయనుంది.  . రిలయెన్స్ - ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 502 సెల్ టవర్లను 4జి సేవలకు అప్ గ్రేడ్ చేసుకునేందుకు ముఖ్యమంత్రి రిలయెన్స్ సంస్థకు అనుమతినిచ్చారు. ముందుగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఆసుపత్రులలో 4జి సేవలను ప్రవేశపెట్టాలని రిలయన్స్ ప్రతినిధులకు సూచించారు.  భెల్ (BHEL) - అనంతపురం జిల్లాలో రూ. 1500 కోట్లతో భారీ పరిశ్రమ నెలకొల్పేందుకు భెల్ సంస్థ ముందుకొచ్చింది. 500 మందికి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చింది.  సెల్కాన్ - తిరుపతి విమానాశ్రయ సమీపంలో సెల్కాన్ మొబైల్ తయారీ సంస్థకు గత నవంబరు 28న భూమి పూజ చేశారు చంద్రబాబు. రేణిగుంట సమీపంలో ఏర్పాటవుతున్న నాలుగు మొబైల్‌ తయారీ సంస్థలలో సెల్కాన్ ఒకటి. వీటి వలన ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా మరో 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.  లావా - ప్రముఖ మొబైల్ సంస్థ లావా తిరుపతిలోని మొబైల్ మ్యానుఫాక్చరింగ్ హబ్ లో రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తిరుపతిలో 2017కల్లా పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించనున్న ఈ మొబైల్ తయారీ విభాగం ద్వారా 12000 వేల మందికి ఉపాధి లభిస్తుంది వెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ - తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద 122 ఎకరాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ లో మైక్రో మాక్స్ 15 ఎకరాలు, సెల్కొన్ 20 ఎకరాలు, కర్బోన్ 15.28 ఎకరాలు, లావా 20 ఎకరాలు ఉపయోగించుకుని తమ విభాగాలను నెలకొల్పుతున్నారు. ఈ నాలుగు సంస్థలు వివిధ దశల్లో రూ.2000 కోట్ల పెట్టుబడులను పెడుతున్నారు. ఇంకా వీటితో పాటు అసుస్, వన్ ప్లస్ సంస్థలు కూడా రాష్ట్రానికి రానున్నాయి. 0 ఇంకా చదవండి 873 ఎలక్ట్రానిక్ రంగంలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాలు పొందే లక్ష్యంతో ఎలక్ట్రానిక్ పాలసీని రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత రెండేళ్ళలో సాధించిన ప్రగతి ఇలా ఉంది...
  • శ్రీ  నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా విజయవాడలో జరిగిన నిన్న ఒక కార్యక్రమంలో డీఎస్సీ -2014 అభ్యర్థులకు పోస్టింగ్ పత్రాలు అప్పగించారు. నియామక ప్రక్రియ గురించి ఈ పోస్టింగ్స్ లో అన్ని వివాదాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక చురుకైన విధంగా పరిష్కరించబడింది చేశారు. శ్రీ  నారా చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయులకు ప్రమాణస్వీకారం  నిర్వహించారు మరియు వారికి హృదయపూర్వకమైన అబినందనలు తెలిపారు.  నేటి పిల్లలు రేపటి  బాధ్యతయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని ప్రమాణం చేయించారు.     0 ఇంకా చదవండి 872 డీఎస్సీ -2014 అభ్యర్థులకు నేడు పోస్టింగ్స్ ఇచ్చారు.
  • తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటికి రెండేళ్ళు. తెలంగాణ ప్రజలు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటూ, ప్రతి ఇంటికీ సుఖ సంతోషాలు చేరువ అయ్యేందుకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇస్తూ తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలకు రాష్ట ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలిపారు. సమస్యల పరిష్కారంలోనూ, ప్రగతి సాధనలోనూ తెలుగుప్రజలందరూ సోదరభావంతో ఐక్యంగా పురోగమించాలని అన్నారు. 0 ఇంకా చదవండి 871 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటికి రెండేళ్ళు. తెలంగాణ ప్రజలు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.
  • దేశంలోనే మొదటిసారిగా విశాఖపట్నం సముద్ర తీరంలో సాగర ఈత కొలను( sea pool)లను నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సముద్ర స్నానానికని వచ్చి ఎంతోమంది ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోతున్నారు. గత పదేళ్ళలో 75మంది మహిళలతో సహా 465మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు నగరానికి ఉన్న 23 కిలోమీటర్ల బీచ్ రోడ్డు వెంబడి సాగర ఈత కొలనులను నిర్మించాలని నిర్ణయించారు. వీటి నిర్మాణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ, గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థల ఇంజనీర్లు చేపట్టనుండగా, రాష్ట్ర పర్యాటక శాఖ నిధులను సమకూరుస్తుంది.  ప్రయోగాత్మకంగా విశాఖ తీరంలోని మంగమారిపేట, లాసన్స్ బే, రుషికొండ, సాగర నగర్ ల వద్ద మొదట నిర్మిస్తారు. దక్షిణ ఆఫ్రికా, అమెరికా దేశాలలో ఇటువంటివి బాగా పేరు పొందాయి. వాటి తరహాలోనే విశాఖ సాగర ఈత కొలనులు రూపుదిద్దుకోనున్నాయి. 0 ఇంకా చదవండి 869 దేశంలోనే మొదటిసారిగా విశాఖపట్నం సముద్ర తీరంలో సాగర ఈత కొలను( sea pool)లను నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
  • రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నవనిర్మాణ కార్యక్రమాలను స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ పరిపాలనాధికారి వరకు, మంత్రి నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు అందరూ దీనిలో భాగస్వాములు కావాలని సూచించారు. నవనిర్మాణ వారం సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని ఎలాంటి పరిస్థితుల్లో విభజించారో ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకొని పునర్నిర్మాణానికి దీక్షబూనాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు జూన్ 2 నుంచి 7 వరకు నవనిర్మాణ వారం: జూన్‌2న ఉదయం 11గంటలకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయాలి.  3న.. అశాస్త్రీయ విభజన, రాష్ట్రంపై దాని ప్రభావం, రాష్ట్రంఎదుర్కొన్న ఇబ్బందులపై శాసనసభ నియోజకవర్గాలవారీగా సదస్సులు.  4న.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలు, ప్రభుత్వం సమష్టిగా సాధించిన విజయాలపై సదస్సులు. రాజధాని భూసమీకరణ, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం, ఇతర ప్రభుత్వ విజయాలు, ప్రగతి నివేదికలపై సదస్సులు.  5న.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతి, కార్యాచరణపై సదస్సులు.  6న.. పరిశ్రమలు, సేవారంగంలో ప్రగతి, భవిష్యత్తు కార్యాచరణకు సదస్సు.  7న.. రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, విజయాలు, ప్రణాళికలు, వ్యూహాలపై సదస్సు.  8న.. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసి జూన్‌8 నాటికి రెండేళ్లు పూర్తవుతున్నందున మహా సంకల్ప భారీ బహిరంగ సభ. ఒంగోలు లేదా రాజమహేంద్రవరంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడ బెంజి సర్కిల్‌ వేదికగా ముఖ్యమంత్రి పాల్గొనే నవ నిర్మాణ దీక్ష:  జూన్ రెండో తేదీన ముఖ్యమంత్రి పాల్గొనే నవ నిర్మాణ దీక్ష ప్రధాన కార్యక్రమానికి విజయవాడ బెంజి సర్కిల్‌ వేదిక కానుంది. ఉదయం తొమ్మిదింటికి కార్యక్రమం ప్రారంభమవుతుంది. 11 గంటలకు మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయిస్తారు. గ్రామీణ స్థాయి వరకూ దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మొత్తం 30 వేల మంది వరకూ ప్రజలు బెంజిసర్కిల్‌ వేదిక వద్దకు హాజరవుతారని అంచనా. ముఖ్యమంత్రి చంద్రబాబు పీడబ్ల్యూడీ మైదానం నుంచి బెంజిసర్కిల్‌ వరకూ ప్రదర్శనగా వస్తారు. బెంజి సర్కిల్‌ వద్ద ఆరడుగుల ఎత్తు, 60×40 విస్తీర్ణంలో నవనిర్మాణ దీక్ష వేదికను సిద్ధం చేస్తున్నారు. 0 ఇంకా చదవండి 868 రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నవనిర్మాణ కార్యక్రమాలను స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

Pages