ఇటీవలి వార్తలు

  • తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రెండు హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని చేపట్టేందుకు ఓఎన్‌జీసీ సంసిద్ధతను వ్యక్తం చేసింది. పది బిలియన్‌ డాలర్ల (సుమారు 68,000 కోట్ల రూపాయల) పెట్టుబడులతో ఈ రెండు ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేస్తామని ఓఎన్‌జీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అలోక్‌నందన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిపారు. విజయవాడలో సోమవారం రాత్రి ఆయన సీఎంను కలిసి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. గోదావరి-కృష్ణా బేసిన్‌లో అపార చమురు-సహజ వాయు నిక్షేపాలను వెలికి తీస్తున్న ఓఎన్‌జీసీ, మరికొన్ని అదే తరహా సంస్థల కన్సార్టియంను ఏర్పాటు చేసి రాష్ట్రంలో హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఇందులో భాగంగానే కన్సార్టియం ద్వారానే తాజా రెండు ప్రాజెక్టుల ఏర్పాటుపై కూడా పరిశీలన జరుగుతోంది. ఓఎన్‌జీసీ చేపట్టే ప్రాజెక్టులు, కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చంద్రబాబు వెల్లడించారు. 0 ఇంకా చదవండి 1067 కాకినాడలో రెండు హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని ఏర్పాటుకు ఓఎన్‌జీసీ సంసిద్ధత
  • ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) గారు చెన్నైలోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం కన్ను మూశారు. 1930 జులై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో పట్టాభిరామయ్య, సూర్యకాంతం దంపతులకు జన్మించిన ఆయన ఆరేళ్ల వయసులో గాయకుడిగా సంగీత ప్రస్థానం ప్రారంభించారు. తండ్రి పట్టాభిరామయ్య వద్ద సంగీత స్వర సాధనకు శ్రీకారం చుట్టి గాత్ర సంగీతంలోనే కాక వయోలిన్‌, వీణ, మురళి, మృదంగం తదితర సంగీత వాయిద్యాల్లో ప్రావీణ్యం సాధించారు. తితిదే, శృంగేరి పీఠాల ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు. శ్రీ మంగళంపల్లి  బాలమురళీకృష్ణ గారు చెన్నై లో నేడు తన తుది శ్వాస విడిచారు. సంప్రదాయ సంగీతంలో మేరనగమైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్వర్గస్తులైన సందర్భంగా ఆ స్వరజ్ఞానికి నివాళులర్పిస్తోంది తెలుగుదేశం.   0 ఇంకా చదవండి 1066 మూగబోయిన సంగీత పుంబావ సరస్వతి
  • దేశంలో రాష్ట్రాలవారీగా ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలుస్తోంది. 2.94 కోట్ల కనెక్షన్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా తమిళనాడు (2.80 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌ (2.48 కోట్లు), కర్ణాటక (2.26 కోట్లు) రాష్ట్రాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వం వద్దనున్న గణాంక సమాచారం ప్రకారం ఈ ఏడాది మార్చి మాసాంతానికి దేశం మొత్తంమీద 34.26 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు పనిచేస్తున్నాయి. అత్యల్పంగా హిమాచల్‌ప్రదేశ్‌లో కేవలం 30 లక్షల మందికి ఇంటర్నెట్ సదుపాయం ఉంది. దేశం మొత్తం మీద 67%పైగా కనెక్షన్లు నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా నగర ప్రాంత వినియోగదారులు తమిళనాడులో ఉన్నారు. దిల్లీలో 2కోట్ల మంది, ముంబయిలో 1.56కోట్లు, కోల్‌కతాలో 92లక్షల మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. 0 ఇంకా చదవండి 1063 ఏపీలో ఎక్కువమందికి ఇంటర్నెట్ సదుపాయం, దేశంలో మూడవస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌
  • దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగార్హత నైపుణ్యాలు మెరుగ్గా ఉన్నాయి. 29 రాష్ట్రాల నుండి 5.6 లక్షల మంది విద్యార్థులలో ఉద్యోగార్హత నైపుణ్యాలను అంచనావేసిన వీబాక్స్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రముఖ ఆన్ లైన్ టాలెంట్ అసెస్మెంట్ సంస్థ వీబాక్స్ AICTE, UNDP మరియు CII సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన నైపుణ్య పరీక్షలో దేశంలో మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మెరుగైన నైపుణ్యాలను కలిగి ఉన్నారని తేలింది. వివిధ రంగాలకు చెందిన 125 సంస్థల కోసం, ఆ సంస్థల ఉద్యోగులకు ఉండాల్సిన నైపుణ్యాలను పరీక్షించేందుకు వీబాక్స్ సంస్థ ఈ ఆన్ లైన్ పరీక్షను నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ నుండి 70,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మార్కెట్ డిమాండుకు అనుగుణంగా న్యూమరికల్, లాజికల్, సాఫ్ట్ స్కిల్స్, డొమైన్ నాలెడ్జ్ అంశాలలో విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించగా గుంటూరు, విశాఖపట్నం జిల్లాలకు చెందిన విద్యార్థులు మరింత ముందంజలో ఉన్నారు. యువకులతో పోలిస్తే యువతులు మరింత మెరుగైన నైపుణ్యాలతో ఉన్నారని వీబాక్స్ తెలిపింది. 0 ఇంకా చదవండి 1058 ఉద్యోగార్హత నైపుణ్యాలలో ఆంధ్రప్రదేశ్ యువత మెరుగు
  • రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటును తగ్గించి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే సంకల్పంతో నిరుపేద గిరిజన, గ్రామీణ ప్రాంత గర్భిణీలు, బాలింతల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్న అమృత హస్తం’ పథకాన్ని అమలుచేస్తోంది. గర్బిణీలు సంపూర్ణ ఆరోగ్యవంతులైన బిడ్డలకు జన్మనివ్వాలన్న ఉద్దేశంతో, ప్రసవం తర్వాత కూడా పౌష్టికాహార లోపంతో ఏ తల్లీ ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఆహారాన్ని అందిస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది రూ.95 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గర్బిణీలకు, బాలింతలకు 200 మిల్లీలీటర్ల చొప్పున పాలు, అన్నం, పప్పు, కూరలు అందిస్తారు. ఆకు కూరలను వారానికి మూడుసార్లు కచ్చితంగా అందిస్తారు. నిత్యం కోడిగుడ్డును అందజేస్తారు. అవసరమైన మేరకు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లను ఇస్తున్నారు. తల్లి, గర్బిణీలు రోజు వారీ తీసుకునే ఆహారంలో 40 శాతం ఆహారం ఈ పథకం ద్వారా సమకూరుతుంది. 'అన్న అమృత హస్తం’ పథకం ద్వారా 2.59 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు లబ్ధి పొందుతున్నారు. ఇటీవల లెక్కల ప్రకారం ఈ పథకాన్ని వినియోగించుకుని 1,40,624 మంది గర్భిణీలు 5-8 కిలోల మేర బరువు పెరిగారు. మొత్తం 16,603 ప్రసవాలు జరగ్గా వాటిలో 12,111 ప్రసవాల్లో జన్మించిన శిశువులు రెండున్నర కిలోల కంటే ఎక్కువ బరువుతో జన్మించారని తెలిపింది. 0 ఇంకా చదవండి 1057 గర్భిణీలు, బాలింతలకు బలవర్ధకం ఫలిస్తోన్న 'అన్న అమృత హస్తం’ పథకం

Pages