English version
 
 
 
 
వినూత్నపథకాలు


పనికి ఆహార పథకం - పేదలకు ఉపాధికల్పన

తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమాలల్లో ‘పనికి ఆహార పధకం’ఒకటి. దీనివల్ల లక్షలాది మంది పేదలకు ఉపాధి లభించ గలిగింది.
2001,2002,2003 సంవత్సరాలలో రాష్ట్ర్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు కురవక, భూగర్బజలాలు అడుగంటి వ్యవసాయం కుంటు పడింది. వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరకని క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. అటువంటి సమయంలో రాష్ట్ర్రముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర్రంలో ‘పనికి ఆహార పథకాన్ని ప్రారంభించేందుకు ఒప్పించారు.

900మండలాలకు పైగా ఏర్పడిన కరువును నివారించి,రైతు కూలీలకు పనిచేయడానికి ముందు కొచ్చే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఈ పథకం మొదలైంది. కరువును తమ రాజకీయాలకు వాడుకోవాలని చూసిన కాంగ్రెస్ నాయకులకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు అయింది.‘పనికి ఆహార పథకం అమలులో తెలుగుదేశం ప్రభుత్వం విఫలం అవుతుందని విమర్శించారు. అయితే వారి అంచనాలు తలక్రిందులయ్యేటట్లు మొదటి విడతగా 5 లక్షల టన్నులు,మరో విడత 5 లక్షలు టన్నులు. ఈ విధంగా బియ్యం మొత్తం రాష్ట్ర్రానికొచ్చే సరికి వారు తట్టుకోలేక పోయారు. దాంతో‘పనికి ఆహార పథకం’దుర్వినియోగం అవుతున్నదంటూ దుష్ప్రచారం మొదలు పెట్టారు. బియ్యం ఇవ్వడం ఆపివేయాలంటూ రాష్ట్ర్రాన్ని సందర్శించిన కేంద్ర బృందాన్ని కలిసి వినతి పత్రాలను అందించారు. వత్తిడి చేశారు. ఊరు,వాడ యాగీ శారు.అయినప్పటికి వారి ఆటలు సాగలేదు. దాంతో కడుపు మంటతో చివరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు లేఖలు రాసే నీచానికి ఒడిగట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఆధికంగా బియ్యం ఇస్తోందని అందువల్ల దానిని అడ్డుకోవాలని 14 కాంగ్రెస్ పాలిత రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులను రెచ్చగొట్టారు. ఆ విధంగా రాష్ట్ర్ర్ర ప్రయోజనాలు గండికొట్టడానికి కూడా వెనకాడలేదు.


కాగా రాష్ట్ర్రానికొచ్చిన 55లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ద్వారా కరువు పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కోవడం జరిగింది. ఈ పథకం గ్రామాల్లో శాశ్వత నిర్మాణాలు, నిరంతర ఆదాయం కల్పించే పనులు జరిగాయి. దీని అమలులో అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ఏజన్సీలు, స్వయం సహాయక సంఘాలు,స్థానిక సంఘాలు, మార్కెట్ కమీటిలు, నీటి వినియోగదారుల సంఘాలు, వాటర్ షెడ్ కమీటీలు ,రైతు క్లబ్‌లు మొదలైన వాటిని భాగస్వాములను చేయడం జరిగింది. పథకంలో అక్రమాలు జరక్కుండా ఇంజనీరింగ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా 10% పనులను తనిఖీ చేసింది. మొత్తం మీద దాదాపు 40 వేల తనిఖీలు జరిగాయి. 35వేల పనుల్లో ఎటువంటి అవకతవకలు లేవని తేలాయి. అయితే 2,917 కేసులలో అవకతవకలు జరిగినట్లు తేలడంతో బాధ్యులైన 198 మంది ఉద్యోగులపై కేసులు పెట్టి 88 మందిని సస్పెండ్ చేశారు. 28 మంది సర్పంచ్‌లు ఇద్దరు ఎంపిటిసిలు, ఇద్దరు ఎంపీపీలు, ఒక జడ్‌పిటిసి పైన కూడా చర్యలు తీసుకున్నారు. అదే విధంగా 214 చౌక ధరల దుకాణాలపైన,81 రైస్‌మిల్లులపైన చర్యలు తీసుకున్నారు. అక్రమాలలో పాత్ర ఉందని తేలిన రేషన్ షాపు డీలర్ల లైసెన్సులు రద్దుచేశారు.ఈవిధంగా ప్రజలు కష్టాల్లో వున్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం పనికి ఆహారం పథకాన్ని సమర్ధవంతంగా మలు చేయగలిగింది.